హస్తినలో అన్ని ప్రైవేటు కార్యాలయాలు మూసివేత
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా థర్డ్‌వేవ్ నుంచి బయటపడేందుకు, ప్రజలను కాపాడేందుకు వీలుగా వివిధ రకాలైన ఆంక్షలు, నిబంధనలు, మార్గదర్శకాలను మరింత కఠినతరం చేసింది.
ముఖ్యంగా, ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కొత్త ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. కొత్త నిబంధనల మేరకు ఢిల్లీలోని అన్ని ప్రైవేటు ఆఫీసులను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది.
ప్రైవేట్ ఆఫీసులు వర్క్‌ఫ్రమ్ హోంకే ప్రధాన్యత ఇవ్వాలని ఆదేశించింది. డీడీఎంఏ జారీచేసిన కొత్త మార్గదర్శకాల్లో అవసరమైన సేవలతో అనుసంధానించబడిన కార్యాలయాలు మినహా అన్ని ప్రైవేటు కార్యాలయాలను మూసివేయాలని కోరింది.