గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (13:14 IST)

భర్తే కామాంధుడు.. కట్టుకున్న భార్యను ప్రైవేట్ భాగాలను సిగరెట్‌తో కాల్చుతూ..?

భర్తే కామాంధుడిగా మారి, భార్య పట్ల మృగంలా మారాడు. కట్టుకున్న భర్తే మృగంలా మారి తన స్నేహితులతో కలిసి తన భార్యపై అత్యంత కిరాతకానికి ఒడిగట్టాడు. స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే... తన భర్త, అతడి స్నేహితులు అసహజరీతిలో తనపై అత్యాచారం చేసి సిగరెట్లతో రహస్య భాగాల్లో కాల్చి టార్చర్‌ చేశారని ఆరోపిస్తూ ఆమె ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
 
లైంగిక దాడిని ప్రతిఘటిస్తే చంపేస్తామని బెదిరించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇండోర్‌లోని షిప్రా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ఫాం హౌస్‌లో 2019 నవంబర్‌, 2021 అక్టోబర్‌లలో ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు.