శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (17:21 IST)

Priyanka Arul Mohan ఫోటోలు వైరల్.. (video)

Priyanka Mohan
నేచురల్ స్టార్ నానితో 'గ్యాంగ్ లీడర్' సినిమాలో నటించిన ప్రియాంక అరుల్ మోహన్ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ప్రియాంక అరుల్ మోహన్ ఆపై శర్వానంద్‌తో 'శ్రీకారం' సినిమాలోనూ నటించి తెలుగు ప్రేక్షకుల దృష్టిలో బాగానే పడింది. అయితే, వరుసగా ఛాన్సులు దక్కించుకోవడంలో ఫెయిలైంది ఈ చెన్నై బ్యూటీ.  
Priyanka Arul Mohan
Priyanka Arul Mohan
 
సెలెక్టివ్‌గా సినిమాలను చేసుకుంటూ పోతోంది. తమిళ స్టార్ హీరో సూర్యతో ఓ సినిమాలో నటించింది. అలాగే, 'డాక్టర్' సినిమా కోసం తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్‌తో జత కట్టింది. తాజాగా 'డాన్' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది ప్రియాంక మోహన్.
 
ఈ సినిమాలోనూ శివ కార్తికేయనే హీరో కావడం విశేషం. ఇక ఇప్పుడే తెలుగులో కొన్ని కథలు వింటోందట. తనను ఇన్సిపైర్ చేసేలా ఆ కథలు లేవంటోంది. 
Priyanka Arul Mohan
Priyanka Arul Mohan
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్‌గా వుంటోంది. ప్రియాంకా మోహన్ క్యూట్ లుక్స్‌కి పడిపోయిన కుర్రకారు చాలా ఎక్కువే. ఇన్‌స్టా వేదికగా ఏకంగా మూడు లక్షల మంది ఫాలోవర్లున్నారు. దీంతో ఆమెకున్న క్రేజ్ ఏంటో ఇట్టే తెలుసుకోవచ్చు.