ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (13:43 IST)

అకీరానందన్ కంపోజింగ్ అదుర్స్.. వీడియో వైరల్

Akira Nandan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరానందన్.. నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి నటనపై శిక్షణ కూడా పూర్తి చేశాడు. అకీరానందన్ సంగీత దర్శకత్వం చేసే అవకాశాలు కూడా లేకపోలేదని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
 
ఇకపోతే తాజాగా అడవి శేష్ హీరోగా వచ్చిన మేజర్ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో మన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో హృదయమా అంటూ సాగే ఈ పాటను కీబోర్డు సహాయంతో కంపోజ్ చేశారు అకీరానందన్. 
 
ఇక ఈ కంపోజ్ చేసిన వీడియోను అడవి శేష్‌కు షేర్ చేయగా.. ఆ వీడియో అతను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ప్రస్తుతం చాలా వైరల్‌గా మారుతోంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇకపోతే అడవిశేషు ట్విట్టర్ ద్వారా ఆ వీడియోని షేర్ చేస్తూ.. ఈ పాటను కంపోజ్ చేసి పంపినందుకు థాంక్యూ అఖీరా అంటూ తెలిపాడు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి కూడా భారీ స్పందన లభిస్తోంది. జూనియర్ పవర్ స్టార్ అంటూ ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.