సోమవారం, 4 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (16:43 IST)

నయనతార వెడ్డింగ్ ఇన్విటేషన్‌ వైరల్ (వీడియో)

దక్షిణాది లేది సూపర్ స్టార్ నయనతార వివాహ వేడుక ఈ నెల 9న చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జరగనుంది. వీరి వెడ్డింగ్ ఇన్విటేషన్‌తో కూడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇప్పటికే వీరి వివాహానికి ముందుగా ప్రివ్యూ షూటింగ్ ఆదివారం జరిగింది. వివాహ దృశ్యాలతో వెడ్డింగ్ డాక్యుమెంటరీని గౌతమ్ మీనన్ రూపొందించనున్నారు. అనంతరం దీన్ని నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేస్తారని సమాచారం.  
 
వివాహ వేడుకను చిత్రీకరించి, అనంతరం దానిని ఒక డాక్యుమెంటరీగా రూపొందించిన తర్వాత ఓటీటీ ప్లాట్ ఫామ్ పై విడుదల చేస్తారని తెలుస్తోంది. 
 
పెళ్లి డాక్యుమెంటరీ ప్రసార హక్కులను విక్రయించడం ద్వారా వారికి పెద్ద మొత్తంలో సమకూరే అవకాశం ఉంది. తాజాగా నయన్-విక్కీ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hanoosh