శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2022 (18:37 IST)

గన్నవరం ఎయిర్‌పోర్టుకు పవన్ కల్యాణ్ (video)

pawan kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. పార్టీ విస్తృత స్థాయి స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు ఆయ‌న విజ‌య‌వాడ వ‌చ్చారు. 
 
శుక్ర‌వారం రాత్రి విజ‌య‌వాడ‌లోనే బ‌స చేయ‌నున్న ప‌వ‌న్ శ‌నివారం పార్టీ స‌మావేశానికి హాజ‌రు కానున్నారు. అంతేగాకుండా మంగళగిరిలో  రెండు రోజుల పాటు ఆయ‌న విజ‌యవాడ‌లోనే ఉండ‌నున్నారు. 
 
మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో శ‌నివారం పార్టీ విస్తృత స్థాయి స‌మావేశాన్ని ప‌వ‌న్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.
 
2024 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల‌న్న దిశ‌గానూ ఈ స‌మావేశంలో పార్టీ శ్రేణుల‌కు ప‌వ‌న్ క్లారిటీ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన రేప‌టి విస్తృత స్థాయి స‌మావేశంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆసక్తి నెల‌కొంది.