శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 30 మే 2022 (22:32 IST)

విజయవాడకు ప్రపంచశ్రేణి, అందుబాటు ధరలలో క్యాన్సర్‌ చికిత్సను తీసుకువచ్చిన మేదాంత

Doctor
తొలి దశలోనే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సంబంధిత సమస్యలను గుర్తించడంతో పాటుగా వాటికి తగిన చికిత్సనందించడంలో భాగంగా మేదాంత గురుగ్రామ్‌ ఇప్పుడు విజయవాడలోని ఫెయిత్‌ స్పెషాలిటీ క్లీనిక్‌తో భాగస్వామ్యం చేసుకుని ప్రపంచశ్రేణి నిపుణుల సలహాలు, చికిత్సా మార్గదర్శకాలను ప్రజలకు అందిస్తోంది.

 
డాక్టర్‌ పుల్లె,  ప్రెసిడెంట్‌ గోల్డ్‌ మెడల్‌ను జనరల్‌ సర్జరీ, థొరాకిక్‌ సర్జరీ అంశాలలో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ నుంచి అందుకున్నారు. లంగ్‌ క్యాన్సర్‌,  థమోమా, ట్రాచియో బ్రాంకియల్‌, ఈసోఫాగల్‌ క్యాన్సర్‌కు సంబంధించి మినిమల్లీ ఇన్వాసివ్‌ థొరాకిక్‌ సర్జరీ పరంగా అపార అనుభవం ఆయనకు ఉంది.

 
ఊపిరితిత్తుల క్యాన్సర్‌ తొలి లక్షణాలను గురించి డాక్టర్‌ పుల్లె మాట్లాడుతూ, ‘‘ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో సాధారణంగా దగ్గు వచ్చి తగ్గదు. కొంతమంది రోగులలో దగ్గుతో పాటుగా రక్తం పడుతుంది. శ్వాసతీసుకుంటే  ఛాతీలో నొప్పి కూడా వస్తుంది. బరువు తగ్గుతుంది. అలసట, నీరసం వంటివి ఊపిరితిత్తుల ల క్షణాలు.

 
క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే చికిత్సనందించడం సులభం. అది తక్కువ ఖర్చులో సైతం ఉండటంతో పాటుగా రోగులకు మెరుగైన జీవనాన్ని సాధ్యం చేస్తుంది. డాక్టర్‌ మోహన్‌ వెంకటేష్‌ పుల్లె, అసోసియేట్‌ కన్సల్టెంట్‌, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చెస్ట్‌ సర్జరీ- చెస్ట్‌ ఆంకో సర్జరీ మరియు లంగ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌- మేదాంత గురుగ్రామ్‌ ఇకపై విజయవాడలోని రోగులను ఫెయిత్‌ స్పెషాలిటీ క్లీనిక్‌ వద్ద కూడా పరీక్షించనున్నారు.