టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌పై కేసు కొట్టివేత  
                                       
                  
                  				  తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై నమోదైన కేసును విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు శుక్రవారం కొట్టివేసింది. చింతమనేనిపై పోలీసులు మోపిన అభియోగాలను నిరూపించలేక పోవడంతో కేసును కొట్టివేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. 
				  											
																													
									  
	 
	కాగా, గత 2011లో ఓ మహిళపై దాడి చేశారంటూ చింతమనేనిపై వచ్చిన ఓ ఫిర్యాదు మేరకు ఏలూరు  పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై 2011 నుంచి విచారణ జరుగుతూ వచ్చింది. ఈ సుధీర్ఘ విచారణ తర్వాత ఈ కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.