మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 మే 2022 (10:44 IST)

అయ్య బాబోయ్.. ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసా?

corona
అవును.. నిజమే.. ఉత్తర కొరియా గురువారం మొట్టమొదటి కొవిడ్ -19 కేసు నమోదవడం సంచలనం రేపింది. రెండేళ్ల పాటు ఉత్తర కొరియాలో తొంగచూడని కరోనా ప్రస్తుతం ఆ దేశంలో నమోదు కావడం సంచలనం సృష్టించింది. ఇక ఒక్క కరోనా కేసు వెలుగుచూడటంతో నార్త్ కొరియాలోని సరిహద్దుల్లో కఠినమైన నియంత్రణ చర్యలు చేపట్టారు. దీంతో పాటు లాక్‌డౌన్ ప్రకటించారు. 
 
నార్త్ కొరియాలోని ప్యోంగ్యాంగ్ నగరంలో జ్వరంతో బాధపడుతున్న రోగుల నమూనాలను పరీక్షించగా ఒకరికి కొవిడ్ ఒమైక్రాన్ వేరియెంట్ సోకిందని తేలింది. దీంతో నార్త్ కొరియాలో తీవ్రమైన జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 
 
కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అత్యవసర వైరస్ నియంత్రణ వ్యవస్థను అమలు చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పారు. అత్యల్ప వ్యవధిలో కరోనా మూలాన్ని తొలగించడమే తమ లక్ష్యమని కిమ్ చెప్పారు.