మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (20:01 IST)

చైతూ థాంక్యూ నుంచి లవ్ సాంగ్ రిలీజ్ (Video)

Thank you
Thank you
నాగ చైత‌న్య ప్ర‌స్తుతం థాంక్యూ సినిమాలో న‌టిస్తున్నారు. థాంక్యూ సినిమా నుంచి మేక‌ర్స్ ల‌వ్ సాంగ్ రిలీజ్ చేశారు. నాగ‌చైత‌న్య‌, మాళ‌విక న‌య్య‌ర్ మ‌ధ్య ఈ పాట చిత్రీక‌రించారు. 
 
1990 సంవ‌త్స‌రంలో నాగ‌చైత‌న్య కాలేజ్ డేస్ ల‌వ్ స్టోరిపై ఈ పాట సాగింది. అనంత శ్రీరామ్ మంచి లిరిక్స్ అందించారు. ఏంటో.. ఏంటేంటో.. పాట‌ను జోనిత గాంధీ పాడారు. త‌మ‌న్ అద్భుతంగా మ్యూజిక్ కంపోజ్ చేశారు. 
 
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం థాంక్యూ. ఈ సినిమా రొమాంటిక్ సినిమాగా తెర‌కెక్కుతుంది. నాగ చైత‌న్య ఇందులో మూడు విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలోరాశీఖ‌న్నా, మాళ‌విక నాయ‌ర్‌, అవికా గోర్ హీరోయిన్‌లుగా న‌టించారు. 
 
ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పీ.సీ శ్రీరామ్ ప‌నిచేశారు. శ్రీవెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు థాంక్యూ చిత్రాన్ని నిర్మించారు. థాంక్యూ సినిమా జూలై 8 న థియేట‌ర్ల‌లో వారంలో విడుద‌ల చేయ‌నున్నారు.