నాకు పురుడు పోసిన మాతృమూర్తికి ప్రణీత స్పెషల్ నోట్
టాలీవుడ్ హీరోయిన్ , పవన్ కల్యాణ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ ఈ మధ్యనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను తల్లిని కాబోతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియచేసింది.
ఇక అప్పటినుండి బేబి బంప్ ఫొటో షూట్లు, జిమ్ ఎక్సర్సైజులు, సీమంతం అంటూ ప్రణీతకు సంబంధించిన ప్రతి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
తనకు పాప పుట్టిందన్న విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపిన ప్రణీత హాస్పిటల్ ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. తాజాగా తనకు పురుడు పోసిన తన మాతృమూర్తికి ప్రణీత కృతజ్ఞతలు తెలియచేస్తూ స్పెషల్ నోట్‌ను పంచుకుంది. ప్రణీత తల్లి ఒక గైనకాలజిస్ట్.
ప్రతి అమ్మాయికి ఇలాంటి గైనకాలజిస్ట్ అమ్మ ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదు. ప్రసవాన్ని ఎంతో సులువుగా చేసిన అమ్మ డా. జయశ్రీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానని తెలిపింది. అయితే, తన సొంత కూతురికి పురుడు పొయ్యాలంటే అమ్మ చాలా టెన్షన్ పడి ఉంటుంది.
ఈ విషయాన్ని తలచుకుంటుంటే మున్నాభాయ్ ఎం బి బి ఎస్ సినిమాలో పరేష్ రావల్ చెప్పిన సంఘటన గుర్తుకొస్తుందని తెలిపింది. ఫ్యామిలీ కంటే వర్క్ లైఫ్‌కు అమ్మ ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందని ఇప్పుడే అర్ధమయ్యింది... అని ప్రణీత తాను పోస్ట్ చేసిన నోట్‌లో పేర్కొంది.