సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 11 జూన్ 2022 (18:59 IST)

ప్రణీతా సుభాష్‌కి పండంటి బిడ్డ.... షేర్ చేసిన పవర్ స్టార్ హీరోయిన్

Pranitha Subhash
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
దక్షిణాది తార ప్రణీత సుభాష్ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ ఆనందకర విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. తన తల్లి గైనకాలజిస్టు కావడం తనకు ఎంతో అదృష్టమని చెప్పిన ప్రణీత... తన ప్రసవ సమయంలో తన తల్లి ఉద్వేగానికి గురయ్యారని పేర్కొన్నారు.

Pranitha Subhash
కాగా తనకు సుఖప్రసవం అయ్యేలా కృషి చేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది. తన బిడ్డ ఫోటోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.

 
ప్రణీత సుభాష్ తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో అరంగేట్రం చేసారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంతో ఆమెకి మంచి పేరు వచ్చింది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pranitha Subhash