మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (15:58 IST)

తల్లి కాబోతున్న ప్రణీత.. భర్త పుట్టిన రోజున గర్భవతి నంటూ...

pranitha
pranitha
అందాల నటి ప్రణీత సుభాష్ తల్లి కాబోతోంది. ప్రణీత భర్త నితిన్ రాజు ది పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా తన భర్తకు పుట్టినరోజు (ఈరోజు) శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు తన జీవితంలో ఒక ప్రత్యేక రోజు అంటూ చెప్పుకొచ్చింది. 2021లో ఓ ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును ఆమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.  
 
నితిన్ రాజు 34వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈరోజు తాను గర్భవతిని అని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది ప్రణీత సుభాష్. దీంతో ప్రణీత సుభాష్ అభిమానులు ట్విట్టర్ వేదిక ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు. 
 
ప్రస్తుతం ప్రణీత సుభాష్ ఓ కన్నడ చిత్రంలో నటిస్తోంది. అలాగే వికాస్ పంపాపతి, వినయ్ పంపాపతి దర్శకత్వంలో "రమణ అవతార" అనే చిత్రంలో నటిస్తుంది.