సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (12:51 IST)

ఆ ఛాన్స్ మాకు ఇచ్చినందుకు..థ్యాంక్స్ కళ్యాణ్ బాబాయ్: నిహారిక

Niharika Konidela
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ త్వరలో ఏపీలో పర్యటించనున్నారు. దీంతో ఆయన తన పర్యటన కోసం కొత్త కాన్వాయ్ సిద్ధం చేసుకున్నారు. ఎనిమిది కొత్త కార్లు కొనుగోలు చేశారు పవన్. ఈ కొత్త కార్ల కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చు చేశారని సమాచారం.  
 
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా ఏపీలో కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం తమ వంతుగా సాయం చేసేందుకు మెగా ఫ్యామిలీ ముందుకు వచ్చింది. 
 
నాగబాబు కుటుంబ సభ్యులు, సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు, అలాగే పవన్ చెల్లి మాధవి..కౌలు రైతులని ఆదుకునే కార్యక్రమం కోసం ఆర్థిక సాయం అందించారు. నాగబాబు ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ 10 లక్షలు, నిహారిక 5 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
దీనితో పవన్ వారందరిని అభినందిస్తూ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కామెంట్స్‌కి స్పందిస్తూ నిహారిక ట్వీట్ చేసింది. ప్రజల భవిష్యత్తు కోసం, వారిని అందుకునేందుకు నీవు చేస్తున్న గొప్ప పనిలో చిన్న భాగం అయినందుకు.. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ కళ్యాణ్ బాబాయ్. ప్రజలకు మెరుగైన బాట వేయాలంటే అది నీ ఒక్కడి వల్లే సాధ్యం అని నిహారిక ట్వీట్ చేసింది. తాజాగా నిహారిక తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.