గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జూన్ 2022 (19:56 IST)

రూటు మార్చిన శ్రీరెడ్డి.. రెస్టారెంట్‌కు వెళ్లి.. మార్కులేసింది.. (video)

Srireddy
యూట్యూబ్‌లో శ్రీరెడ్డి బాగా బిజీ అయిపోయింది. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి ప్రస్తుతం రూటు మార్చింది. యూట్యూబ్‌లో వంటలతో అదరగొడుతోంది. 
  
తాజాగా ఆమె ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ ఫుడ్‌ను రుచి చూసింది. ఎంజాయ్ చేసింది. దీంతోపాటు ఆ ఫుడ్‌కు మార్కులు కూడా వేసింది.  
 
ఆ రెస్టారెంట్లో తిన్న ఫుడ్‌ 10 కి 6 మార్కులు వేసింది. ఎప్పుడు తన వీడియోలు పోస్టింగ్ చేసే ఆమె రెస్టారెంట్ లో జరిగిన దాన్ని పోస్టు చేయడంతో అందరు ఆసక్తిగా చూశారు. 
 
గతంలో వివాదాల్లో ఉన్న శ్రీరెడ్డి ప్రస్తుతం ప్రశాంతంగా జీవనం సాగిస్తోంది. తన ప్రొఫెషన్ కోసం వంటలు చేసే ఆమె రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడి ఫుడ్ ఎలా ఉందో అనే దానిపై తన అభిప్రాయం తెలియజేసింది.