శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (16:47 IST)

అర్థరాత్రి 12 గంటల వరకు దుకాణాలు... ఏపీ సర్కారు అనుమతి

andhrapradesh logo
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార దుకాణాలు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, బార్ అండ్ రెస్టారెంట్లకు మాత్రం ఇది వర్తించదు. ఇతర అన్ని రకాల దుకాణాలు ఉదయం 5 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచివుంచుకోవచ్చు.
 
కాగా, కోవిడ్ ఆంక్షల కారణంగా ఈ దుకాణాలన్నీ రాత్రి 10.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచేలా ఆదేశించింది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడటంతో ఈ నిబంధనను తొలగించి అర్థరాత్రి 12.30 గంటల వరకు తెరిచి ఉంచేలా అనుమతి ఇచ్చింది. ఏపీ హోటల్స్ అసోసియేషన్స్ వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.