శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జూన్ 2022 (13:59 IST)

రాసిపెట్టుకోండి.. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైకాపానే : అలీ

actor ali
సినీ హాస్యనటుడు, వైపాకా నేత అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది వైకాపానేనని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా వైకాపా మహా గర్జన జరిగింది. ఇందులో అలీ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని కితాబిచ్చారు. అవినీతికి తావులేకుండా ప్రజల వద్దకే సంక్షేమ పాలన అందిస్తున్న ఘతన ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెదుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైకాపానేనని ఆయన జోస్యం చెప్పారు. 
 
కాగా, వైకాపా అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మెల్‌బోర్న్ వేదికగా వైకాపాకు చెందిన ప్రవాసాంధ్రులు ఈ మహా గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైకాపా ఆస్ట్రేలియా కో ఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఇందులో వైకాపా కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.