1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated: సోమవారం, 13 జూన్ 2022 (11:43 IST)

విద్యార్థుల స‌మ‌క్షంలో ఆది సాయి కుమార్ టాప్ గేర్ టైటిల్ విడుద‌ల‌

Adi Sai Kumar,  K. V. Sridhar Reddy, Shashikant and others
Adi Sai Kumar, K. V. Sridhar Reddy, Shashikant and others
ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆది సాయి కుమార్ కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలు ఎంచుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు. తాజాగా మరో సినిమాను లైన్‌లో పెట్టేశారు. ఈ సినిమా పేరే  టాప్ గేర్. తాజాగా ఈ సినిమా టైటిల్ లాంచ్ హైదరాబాద్ లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. వేలాది మంది స్టూడెంట్స్ నడుమ ఈ టైటిల్ లోగో లాంచ్ చేయడం విశేషం. టైటిల్ లుక్ చూస్తుంటే ఈ సినిమాలో అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ చూపించబోతున్నారని స్పష్టమవుతోంది. ఈ సినిమా తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకం కానుందని హీరో ఆది సాయి కుమార్ చెప్పడం సినిమాపై అంచనాలు పెంచేసింది.  
 
ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ *టాప్ గేర్* సినిమా రాబోతోంది. ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొని ఓ వైవిద్యభరితమైన కథతో రూపొందించనున్నారు. చిత్రానికి K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.  
 
పలు సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా సేవలందించిన సాయి శ్రీరామ్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ''జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, మనం, సోగ్గాడే చిన్నినాయనా'' లాంటి సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన ప్రవీణ్ పూడి ఈ మూవీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో  బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్, రేడియో మిర్చి హేమంత్  తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.    
 
టెక్నీషియన్స్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శశికాంత్ 
సినిమాటోగ్రాఫర్: సాయి శ్రీరామ్ 
మ్యూజిక్: హర్ష వర్ధన్ రామేశ్వర్ 
ఎడిటర్: ప్రవీణ్ పూడి 
ఆర్ట్: రామాంజనేయులు  
కాస్ట్యూమ్ డిజైనర్: మాన్వి 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి   
ప్రొడ్యూసర్: K. V. శ్రీధర్ రెడ్డి  
బ్యానర్: శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ 
ప్రెజెంట్స్: ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్.