మార్నింగ్ వాకింగ్ చేసిన తర్వాత ఏం తినాలో తెలుసా?
బరువు తగ్గాలంటే ఉదయం నడక ప్రయోజనకరంగా భావిస్తారు చాలామంది. మార్నింగ్ వాక్ అయితే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల రిఫ్రెష్‌గా ఉండటమే కాకుండా శరీరం, మానసిక ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మార్నింగ్ వాక్ చేయడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు వంటివి అదుపులో వుంచవచ్చు. అయితే మార్నింగ్ వాక్ తర్వాత సరైన డైట్ తీసుకోవాలి. అవేంటో చూద్దాం.
గింజలు, డ్రైఫ్రూట్స్‌లో హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరాన్ని దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు, ఉదయం నడక తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బలపడి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఓట్స్ ఫైబర్ యొక్క అద్భుతమైన మూలం. ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఓట్స్ తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. మార్నింగ్ వాక్ చేసిన తర్వాత ఓట్స్ తినవచ్చు.
మొలకెత్తిన పెసర పప్పు, సోయాబీన్ లేదా శనగలు మొదలైన వాటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఉదయం నడక తర్వాత దీన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. బరువు కూడా సులభంగా తగ్గుతుంది.