శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (11:45 IST)

భారతీయ చిరుతిండ్లకు అమెరికన్లు ఫిదా.. బెస్ట్ రెస్టారెంట్‌గా చాయ్ పానీ

chai pani restaurant
భారతీయ సంప్రదాయ చిరుతిండ్లకు అగ్రరాజ్యం అమెరికా ప్రజలు ఫిదా అయ్యారు. దీంతో అమెరికాలో భారతీయ చిరుతిండ్లకు ప్రసిద్ధికెక్కిన చాయ్ పానీ రెస్టారెంట్‌ను అత్యుత్తమ రెస్టారెంట్‌గా ఎంపిక చేశారు. జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ నామినేషన్లలో చాయ్ పానీ రెస్టారెంట్‌కు అగ్రస్థానం లభించింది. 
 
ఈ రెస్టారెంట్ నార్త్ కరోలినాలోని ఆష్ విల్లే ప్రాంతంలో ఉంది. షికాగోలో సోమవారం బెస్ట్ ఈటరీ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. న్యూ ఆర్లియెన్స్‌కు చెందిన బ్రెన్నన్స్ వంటి ప్రముఖ రెస్టారెంట్‌ను సైతం చాయ్ పానీ వెనక్కి నెట్టడం విశేషం. 
 
మరోవైపు, గతంలో ఈ అవార్డును న్యూయార్క్ లేదా షికాగోలోని రెస్టారెంట్లే చేజిక్కించుకునేవి. తొలిసారి భారత వంటకాలకు పేరొందిన రెస్టారెంట్ అమెరికాలో నంబర్ వన్‌గా నిలిచింది. 
 
చాయ్ పానీ రెస్టారెంట్ ఇండియన్ స్నాక్స్‌కు చాలా ఫేమస్. ఇక్కడ తయారుచేసే చాట్ తినేందుకు అమెరికన్లు పడిచస్తుంటారు. చాయ్ పానీ భిన్న రకాల రుచుల్లో పసందైన చాట్లను, ఇతర వంటకాలను వేడివేడిగా అందిస్తుంటుంది.