గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 మే 2022 (14:06 IST)

పుష్ప మానియా.. తగ్గేదేలే అంటోన్న నేపాల్ బౌలర్ సీతారాణా (video)

Sita Rana Magar
Sita Rana Magar
పుష్పలో అల్లు అర్జున్ తగ్గేదేలే స్టైల్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. పుష్ప స్టైల్‌లో తగ్గేదేలా స్టైల్‌ను అనుకరించడంతో పుష్ప క్రేజ్ దేశవిదేశాల్లో మార్మోగింది. అప్పటి నుంచి ఎక్కడ చూసినా పుష్ప మానియా ఓ రేంజ్‌లో ఉంది. 
 
లేటెస్ట్‌గా నేపాల్ మహిళా బౌలర్ వికెట్ తీసిన తర్వాత పుష్ఫ స్టైల్ అనుకరించిన ఓ వీడియోను ఐసీసీ తన ట్విట్టర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
 
దుబాయ్‌లో ఫెయిర్ బ్రేక్ ఇన్విటేషనల్ టోర్నమెంట్ జరుగుతోంది. మే 5న టోర్నడో ఉమెన్, సఫెరీ ఉమెన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నేపాల్ బౌలర్ సీతారాణా మగర్ వికెట్ తీసిన తర్వాత దవడ కింద చెయ్యితో పుష్ప స్టైల్‌తో తగ్గేదేలా అంటూ సెలబ్రేట్ చేసుకుంది. 
 
ఈ వీడియోను ఐసీసీ ట్విట్టర్లో షేర్ చేసింది. నేపాల్ బౌలర్ సీతారాణా మగర్ మోస్ట్ పాపులర్ సెలబ్రేషన్స్ చూడండి అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 19 లక్షలకు పైగా చూశారు. 3 లక్షలకు పైగా లైక్ చేశారు.