గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2022 (19:43 IST)

క్రికెట్‌లో హ్యాట్రిక్‌.. 6 బంతుల్లో 6 వికెట్లు.. అరుదైన ఫీట్! (video)

cricket balls
మలేషియా క్లబ్ ఎలెవెన్‌కు చెందిన వీరన్‌దీప్ సింగ్ అనే బౌలర్ హ్యాట్రిక్ సృష్టించాడు. ఏకంగా ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీశాడు. నిజానికి వీరన్‌దీప్‌ సింగ్‌ తీసింది ఐదు బంతుల్లో ఐదు వికెట్లు.. ఇక ఆరో వికెట్‌ రనౌట్‌ రూపంలో వచ్చింది. వీరన్‌దీప్‌ సింగ్‌ ఐదు వికెట్ల క్లబ్‌లో జాయిన్‌ అయినప్పటికి ఆరు బంతుల్లో ఆరు వికెట్లు సాధించడమనేది గొప్ప విశేషం.
 
నేపాల్‌ ప్రొ కప్‌ టి20 చాంపియన్‌షిప్‌లో భాగంగా మలేషియా క్లబ్‌ ఎలెవెన్‌ వర్సెస్‌ పుష్‌ స్పోర్ట్స్‌ ఢిల్లీ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో వీరన్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌కు రాకముందు పుష్‌ స్పోర్ట్స్‌ ఢిల్లీ స్కోరు 131-3.. అతని ఓవర్‌ పూర్తయ్యేసరికి 132-9గా మారిపోయింది. 
 
ఓవర్‌ తొలి బంతిని వైడ్‌ వేశాడు. ఆ తర్వాత రెండో బంతికి రనౌట్‌.. ఆ తర్వాత మిగిలిన ఐదు బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులోనే వీరన్‌దీప్‌ సింగ్‌ హ్యట్రిక్‌ నమోదు చేయడం విశేషం. ఈ హ్యాట్రిక్ వికెట్లకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.