బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (09:42 IST)

గుజరాత్ టైటాన్స్ జట్టు దూకుడుకు సన్ రైజర్స్ కళ్లెం

sun risers
స్వదేశంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ అంచె పోటీల్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్ల దూకుడు బ్రేక్ పడింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టును హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఓడించింది. పక్కా వ్యూహంతో ఆడిన హైదరాబాద్ జట్టు ప్రత్యర్థిని చిత్తు చేసి ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ నిర్ధేశించిన 163 పరుగుల టార్గెట్‌ను మరో ఐదు బంతులు మిగిలివుండగానే రెండు వికెట్లు కోల్పోయి గెలుపొందింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. రైజర్స్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేయడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఫీల్డర్లు వరుస క్యాచ్‌లను జారవిడిచినప్పటికీ బౌలర్లు మాత్రం పక్కాగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టారు. 
 
దీంతో భారీ స్కోరు సాధించలేకపోయింది. ఈ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్య 42 బంతుల్లో 50 రన్స్ చేయగా, అభినవ్ మనోహర్ 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, నటరాజన్ 2, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్ ఒకటి చొప్పున పరుగులు చేశారు. 
 
ఆ తర్వా 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 8 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో ఓపెనర్లు అభిషేక్ శ్రమ (42), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (57) మంచి పునాది వేయగా, చివర్లో పూరన్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేయడంతో హైదరాబాద్ జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కేన్ విలియమ్సన్‌కు వరించింది.