1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (22:40 IST)

హైదరాబాద్ చేతిలో చెన్నై అవుట్... 12 ఏళ్ల తర్వాత ఆ సీన్ రిపీట్ అవుతుందా?

CSK
CSK
ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్‌కు చుక్కలు కనిపించాయ్. హైదరాబాదుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై పరాజయం పాలైంది. తద్వారా చెన్నై వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది.
 
మొదట బ్యాటింగ్‌లోనూ పెద్దగా మెరవని సీఎస్‌కే.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ జోరు చూపించలేకపోయింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లు సీఎస్‌కే బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని సీజన్‌లో తొలి విజయాన్ని దక్కించుకుంది.
 
ఈ నేపథ్యంలోనే సీఎస్‌కే ఒక చెత్త రికార్డును నమోదు చేసింది. ఒక సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడం సీఎస్‌కేకే ఇది రెండోసారి. 
 
ఇంతకముందు 2010లో సీఎస్‌కే ఇలాగే వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడింది. కానీ విచిత్రమేంటంటే.. ఆ తర్వాత వరుస విజయాలు సాధించిన సీఎస్‌కే ఏకంగా టైటిల్‌ విజేతగా నిలిచి అందరికి షాకిచ్చింది. అయితే అప్పుడు సీఎస్కేకు కెప్టెన్‌‍గా వున్నాడు. ప్రస్తుతం ఆ సీన్ లేదు. జడేజా కెప్టెన్‌గా వున్నాడు. కానీ 
 
2 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితుల్లోనే తేరుకున్న సీఎస్‌కే చాంపియన్‌గా అవతరించింది. అదే సీన్‌ రిపీట్‌ అవుతుందా అనేది అనుమానమే.
 
ఇకపోతే.. తాజా సీజన్ లో తొలి రెండు మ్యాచ్ లలో ఓటమిపాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ్టి మ్యాచ్ లో అద్భుత విజయం నమోదు చేసింది. 155 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 
 
ఓపెనర్ అభిషేక్ శర్మ సమయోచితంగా విజృంభించి 50 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. అభిషేక్ స్కోరులో 5 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. 
 
మరో ఎండ్ లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాధ్యతాయుతంగా ఆడి 32 పరుగులు చేసి, అభిషేక్ శర్మకు సరైన సహకారం అందించాడు. రాహుల్ త్రిపాఠి 15 బంతుల్లో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. త్రిపాఠి 5 ఫోర్లు, 2 సిక్సులు సంధించాడు. 
 
సన్ రైజర్స్ జట్టు విజయలక్ష్యాన్ని కేవలం 17.4 ఓవర్లలోనే అందుకోవడం విశేషం. చెన్నై బౌలర్లలో ముఖేశ్ చౌదరి 1, బ్రావో 1 వికెట్ తీశారు.