బుధవారం, 4 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (19:51 IST)

చెన్నై-హైదరాబాద్ కీలక పోరు.. సీఎస్కే ఓడితే గోవిందా..!

SRH_CSK
SRH_CSK
ఐపీఎల్ 2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్- సన్ రైజర్స్ హైదరాబాదుల మధ్య కీలక పోరు శనివారం జరుగనుంది. ముంబై లోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ రెండు జట్లు బోణీ కోసం పోటా పోటీగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం గం. 3.30 నుంచి ఆరంభం కానుంది. 
 
కొత్త సారథి రవీంద్ర జడేజా నాయకత్వంలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓడిన చెన్నై పరాజయాల హ్యాట్రిక్‌ను పూర్తి చేసుకున్నాయి. అలాగే కేన్ విలియమ్సన్ సారథిగా ఉన్నసన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడింది. దాంతో రేపటి మ్యాచ్ తో ఈ రెండు జట్లలో ఒకటి లీగ్ లో పాయింట్ల ఖాతా తెరిచే అవకాశం ఉంది.
 
రొమారియో షెపర్డ్ పై వేటు తప్పదని తెలుస్తోంది. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ షెపర్డ్ బౌలింగ్ లో రాణించినా బ్యాట్ తో సత్తా చాటలేకపోయాడు. దీంతో ఇతడి స్థానంలో సౌతాఫ్రికా బౌలింగ్ ఆల్ రౌండర్ మార్కో జన్సెన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
 
ఇక రెండు మ్యాచ్ ల్లోనూ విఫలమైన కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్ లో రాణించాల్సి ఉంది. ఇక ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఘోరంగా ఓడిన చెన్నై పరిస్థితి కూడా ఏం బాగాలేదు. రుతురాజ్ ఫామ్‌లో లేకపోవడం జట్టుకు బలహీనత. 
 
అలాగే రాబిన్ ఉతప్ప నిలకడగా ఆడకపోవడం జట్టుకు సమస్యగా మారింది. ఈ మ్యాచ్ లోనూ ఓడితే చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు సన్నగిల్లుతూ వస్తాయి. అలాగే హైదరాబాద్ బోణి చేస్తేనే ఫ్యాన్స్ ఆదరణ పొందుతుంది. మరి ఈ మ్యాచ్ చెన్నైదో లేకుంటే హైదరాబాదుకు దక్కుతుందో తెలుసుకోవాలంటే వేచి చూడాలి.