గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 మార్చి 2022 (12:08 IST)

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డ్..

ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే పవర్‌ప్లేలో అతి తక్కువ పరుగులు సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది.
 
రాజస్థాన్ రాయల్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో పరుగులు పిండుకోవాల్సిన పవర్ ప్లేలో అతి తక్కువ పరుగులు సాధించింది. తొలి ఆరు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 14 పరుగులు మాత్రమే చేసింది. 
 
ఐపీఎల్ పవర్‌ ప్లేలో ఓ జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే. 2009లో కేప్‌టౌన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో రెండు వికెట్ల నష్టానికి 14 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే చెత్త రికార్డు కాగా, ఇప్పుడా రికార్డును హైదరాబాద్ భర్తీ చేసింది.