గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (17:45 IST)

ఆరెంజ్ ఆర్మీ వర్సెస్ కోల్‌కతా.. బౌలింగ్‌లో హైదరాబాద్ ఓకే కానీ..?

SH_RR
ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం ఆరెంజ్ ఆర్మీ బరిలోకి దిగబోతోంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో పింక్ టీమ్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. 
 
తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాలని కేన్ విలియమ్సన్ అండ్ హిస్ టీమ్ ఉవ్విళ్లూరుతోంది. దీనికి అనుగుణంగా కఠోర సాధన చేస్తోంది. ఇకపోతే... సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో పెద్దగా స్టార్లు లేరు. మెగా వేలంపాట సందర్భంగా వేర్వేరు ఫ్రాంఛైజీల్లో జాయిన్ అయ్యారు. 
 
ఒకరకంగా చూస్తే సన్‌రైజర్స్ వద్ద ఉన్నవి పరిమిత బ్యాటింగ్, బౌలింగ్ వనరులే. ఆరెంజ్ ఆర్మీలో బ్యాటింగ్ కంటే బౌలింగ్ డిపార్ట్‌మెంట్ ఒకింత బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. 
 
అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, శ్రేయాస్ గోపాల్, జే సుచిత్ బౌలింగ్ విభాగంలో ఉన్నారు. 
 
హైదరాబాద్‌తో పోల్చుకుంటే- రాజస్థాన్ రాయల్స్ స్టార్లతో నిండివుంది. వీరిని ఆరెంజ్ ఆర్మీ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.