సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఫిబ్రవరి 2022 (14:53 IST)

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఐపీఎల్, పరీక్షలు కొత్త అడ్డంకిగా మారుతాయా?

ఆర్ఆర్ఆర్ సినిమా కొత్త అడ్డంకి వచ్చేలా వుంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్‌లను పరీక్షా సీజన్లను పరిగణిస్తారు. అందువల్ల పెద్ద సినిమాలు ఆ సమయంలో విడుదల కావు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాను మార్చి 25న విడుదల కానుందని ప్రకటించారు. 
 
ఈ ఏడాది మాత్రం పరిస్థితులు మరింత క్లిష్టంగా వున్నాయి. మార్చి, ఏప్రిల్‌లో విద్యార్థులకు పరీక్షలుంటాయి. పైగా ఐపీఎల్ కూడా ప్రారంభం కానుంది. దీంతో ఆర్ఆర్ఆర్‌కు ఐపీఎల్‌తో పాటు విద్యార్థుల పరీక్షలు గండంగా మారింది. 
 
ఇకపోతే.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా ఈ సినిమాలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తున్నాడు. ఇందులో అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.