సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (19:46 IST)

క్వశ్చన్ పేపర్ లీక్.. పాలిటెక్నికల్ చివరి సంవత్సరం పరీక్షలు రద్దు

పాలిటెక్నికల్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సంబంధించి క్వశ్చన్ పేపర్ వాట్సాప్ గ్రూపు‌లో బాగా వైరల్ కావడంతో తెలంగాణ సర్కారు ఆ పరీక్షలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ పరీక్షలు ఈనెల 15,16వ తేదీలలో నిర్వహించనున్నట్లు తెలియజేయడం జరిగింది. 
 
బాటసింగారంలోని స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఎగ్జామ్‌‌కు సంబంధించి క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం జరిగింది. దీంతో అధికారులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. 
 
ఇక స్వాతి ఇన్సిస్టిట్యూట్‌లో ఒక వాట్సప్ ద్వారా ప్రశ్నాపత్రం లీక్ అయినట్లుగా బోర్డు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత అధికారులు ఈ వ్యవహారంపై ఆ కాలేజీపై, పోలీసులకు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దీంతో పోలీసులు స్వాతి ఇన్స్టిట్యూట్ టెక్నాలజీపై కేసు నమోదు చేయడం జరిగింది.  
 
ఇక ఈ క్వశ్చన్ పేపర్ ఎలా లీక్ అయింది అనే విషయంపై చాలా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ వ్యవహారంపై కాలేజీ యాజమాన్యాలు కూడా విచారించడం జరుగుతోంది.