మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. రైల్వే బడ్జెట్ 2014 - 15
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (11:28 IST)

తెలంగాణాలో మే నెలలో టెన్త్ పరీక్షా ఫలితాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. ఇందులోభాగంగా, త్వరలోనే పదో తరగతి పరీక్షా ఫలితాలను వెల్లడించేలా చర్యలు తీసుకుంటుంది. మే 9-12 తేదీల మధ్య పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఎస్ఎస్‌సీ బోర్డు కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. 
 
ఒకవేళ ఇంటర్ పరీక్షలన్నీ పూర్తయ్యాక పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని భావిస్తే మాత్రం టెన్త్ పరీక్షలు మే 11 లేదా మే 12వ తేదీల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిజానికి ఈ పరీక్షలను ఏప్రిల్ నెలలోనే నిర్వహించేందుకు అధికారులు నవంబరు నెల నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. కానీ, కానీ, ఇంటర్ పరీక్షలను ముందు నిర్వహించాల్సి రావడంతో టెన్త్ పరీక్షలను మే నెలలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. 

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందు ఇంటర్ పరీక్షలు, ఆ తర్వాత పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా, మే నెలలో ఈ టెన్త్ పరీక్షలు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు.