బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (11:08 IST)

ప్రేక్షకుల ముందుకు వచ్చిన "ఖిలాడీ"

టాలీవుడ్ మాస్ మహారాజా నటించిన తాజా చిత్రం "ఖిలాడీ". రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీలు హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 
 
ఈ చిత్రంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ, తాను అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని నమ్ముతానంటూ వ్యాఖ్యానించారు. అంటే ఈ చిత్రం విజయంపై అంత నమ్మకం ఉందని చెప్పారు. 
 
కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ కమర్షియల్ మూవీ థియేటర్‌లో శుక్రవారం విడుదలైంది. అయితే, ఈ చిత్రం టాక్ ఎలా వుందన్న అంశంపై మరికొన్ని గంటల్లో తేలనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.