సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఫిబ్రవరి 2022 (09:49 IST)

తెలంగాణ: పదవ తరగతి ఎగ్జామ్‌ షెడ్యూల్ విడుదల

తెలంగాణ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు పదవ తరగతి టైమ్ టేబుల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా మే 11 నుంచి మే 20 వరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు ప్రకటించింది. మే 18 నుంచి 20 వరకు ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
 
తెలంగాణ పదో తరగతి ఎగ్జామ్‌ షెడ్యూల్ వివరాల్లోకి వెళితే.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి.
 
11-05-2022 ఫస్ట్‌ లాంగ్వేజ్‌ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు
12-05-2022 సెకండ్‌ లాంగ్వేజ్‌ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు
13-05-2022 థార్డ్‌ లాంగ్వేజ్‌ (ఇంగ్లిష్‌) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు
 
14-05-2022 మ్యాథమెటిక్స్‌ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు
16-05-2022 జనరల్‌ సైన్స్‌ పేపర్ (ఫిజికల్‌, బయోలాజికల్‌ సైన్స్‌) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు
 
17-05-2022 సోషల్‌ స్టడీస్‌ ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు
18-02-2022 ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 1, (సంస్కృతం, అరబిక్‌) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు
 
19-05-2022 ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 2 (సంస్కృతం, అరబిక్‌) ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు
 
20-05-2022 ఎస్‌ఎస్‌సీ ఓకేషనల్ కోర్స్‌ (థియరీ) ఉదయం 9:30 గంటల నుంచి 11:30 వరకు జరుగుతాయని సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు తెలిపింది.