గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (19:19 IST)

చిన్నారుల ఆకలి తీర్చేందుకు ఎల‌న్ మ‌స్క్ భారీ విరాళం..!

ప్ర‌పంచంలోని చిన్నారుల ఆక‌లి తీర్చేందుకు ప్ర‌పంచ కుబేరులు ముందుకు రావాల‌ని ఐరాస వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ డైరెక్ట‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. 
 
చిన్నారుల ఆక‌లి తీర్చేందుకు ఇచ్చిన డ‌బ్బును ఎలా ఖ‌ర్చు చేస్తారో ప్ర‌ణాళిక ఇస్తే 6 బిలియ‌న్ డాల‌ర్లు ఇప్ప‌టికిప్పుడే ఇస్తాన‌ని గ‌తంలో ప్ర‌పంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 
 
అన్న‌ట్టుగానే మ‌స్క్ 4.2 కోట్ల మంది చిన్నారుల ఆక‌లి తీర్చేందుకు 5.7 బిలియ‌న్ డాల‌ర్లను విరాళంగా అందించారు. న‌వంబ‌ర్ 19 నుంచి న‌వంబ‌ర్ 29 వ‌ర‌కు టెస్లా వాటాలోని త‌న 5 మిలియ‌న్ షేర్ల‌ను విరాళంగా ఇచ్చిన‌ట్టు సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ క‌మిష‌న్ పేర్కొంది. 
 
ఇక ప్ర‌పంచంలో అతిపెద్ద విరాళాల్లో ఇది కూడా ఒక‌టిని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ భారీ విరాళంను ఎల‌న్ మ‌స్క్ ఏ సంస్థ‌కు అందించార‌నేదానిపై క్లారిటీ ఇవ్వ‌లేదు.