సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (13:12 IST)

కేంద్రం కొరఢా : చైనీస్ యాప్‌లపై నిషేధం

కేంద్ర ప్రభుత్వం మరోమారు కొరఢా ఝుళిపించింది. చైనాకు చెందిన యాప్‌లలో మరికొన్నింటిపై నిషేధం విధించింది. గత 2020లో ఏకంగా 224 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెల్సిందే. తాజాగా మరో 54 చైనీస్ యాప్‌లను దేశంలో నిషేధిస్తూ ఆదేశాలు జారీచేసింది. 
 
ఇందులో బ్యూటీ కెమెరా, స్వీట్ సెల్ఫీ, హెచ్.డి. బ్యూటీ కెమెరా సెల్ఫీ కెమెరా, ఈక్వలైజర్ అండ్ బాస్ బూస్టర్, క్యామ్ కార్డ్ ఫర్ సేల్స్ ఫోర్స్ ఈఎన్టీ, ఐసోలాండ్ 2, యాషెస్ ఆఫ్ టైమ్ లైట్, వీవా వీడియో ఎడిటర్, ఆన్ మైయోజీ చెస్, ఆన్ మై ఓజీ ఎరీనా, యాప్ లాక్, డ్యూయల్ స్పేస్ లైట్ వంటి అనేక యాప్‌లు ఉన్నాయి. 
 
ఇవన్నీ దేశ భద్రతకు ముప్పు కలించేవిగా పరిగణించి కేంద్రం ఈ తరహా కఠిన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా, వ్యక్తిగత భద్రతతో పాటు.. ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాయని గుర్తించింది. అందుకే నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి.