గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (16:03 IST)

గ్లాన్స్‌లో జియో సంస్థ రూ.1500 కోట్ల పెట్టుబడి

ప్రముఖ డిజిటల్ కంటెంట్ సంస్థ, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత గ్లాన్స్‌లో జియో సంస్థ రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. బెంగుళూరు కేంద్రంగా పనిచేసే "inmobi"కి చెందిన డిజిటల్ AI ప్లాట్‌ఫామ్ ఈ "గ్లాన్స్".  ఎఐ ఆధారంగా పనిచేసే గ్లాన్స్ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లాక్‌లో ఉన్నా సరే.. లైవ్ కంటెంట్‌ను వీక్షించవచ్చు. 
 
లాక్ స్క్రీన్ లైవ్ కంటెంట్, ఈ-కామర్స్, మొబైల్ యాడ్స్‌లలో గ్లాన్స్‌కు అత్యధిక మార్కెట్ వాటా ఉంది. భారత్‌లో అమ్ముడయ్యే 60 శాతం ఫోన్ లలో డిఫాల్ట్‌గా "గ్లాన్స్" ఇన్స్టాల్ చేసి ఉంటుంది. శాంసంగ్, షావోమి, వివో, ఒప్పో, రియల్‌మీ వంటి ఫోన్‌లలో లాక్ స్క్రీన్‌ను పక్కకు జరపడంతో గ్లాన్స్‌ను వీక్షించవచ్చు