మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2022
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (13:56 IST)

ఎల్ఐసీని పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రైవేటీకరణ చేస్తాం.. సీతారామన్

ఎల్ఐసీని పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక బడ్జెట్‌లో భాగంగా ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించారు. 22-23 ఆర్థిక సంవత్సరానికి గాను లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని ఆమె అన్నారు.
 
దమన్ గంగా - పీర్ పంజాల్, పర్ తాపీ - నర్మదా, గోదావరి - కృష్ణా, కృష్ణా - పెన్నా, పెన్నా - కావేరీ నదుల అనుసంధానానికి బడ్జెట్ లో ప్రోత్సాహం. దీని వల్ల లబ్ధి పొదే రాష్ట్రాల నుంచి అంగీకారం రాగానే నదుల అనుసంధానం ప్రయత్నాలను కేంద్రం ప్రారంభిస్తుందని వెల్లడించారు. 
 
బడ్జెట్ హైలైట్స్ 
డ్రోన్ల సాయంతో పంట పొలాల పరీక్షలు.
వ్యవసాయ యూనివర్శిటీల సిలబస్ లో మార్పులు చేస్తాం.
కాలం చెల్లిన చట్టాలను రద్దు చేస్తాం.
సంరక్షణ సేవల కోసం టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్
 
డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలెక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తాం.
విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ సంస్థల అనుసంధానం.
ప్రైవేట్ రంగంలో అడవుల పెంపకం కోసం పథకం.
ఉత్తర సరిహద్దుల్లో గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం.
 
బొగ్గు ద్వారా గ్యాస్ ఉత్పత్తి కోసం 4 పైలట్ ప్రాజెక్టులు
కరోనా కారణంగా మానసిక అనారోగ్యానికి గురైన వారి కోసం నాణ్యమైన మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ ఇస్తామని వెల్లడించారు.