గ్రామ్ సురక్షా యోజన-పోస్టాఫీస్ నుంచి సూపర్ స్కీమ్.. రూ.1,411 చెల్లిస్తే?
పోస్టాఫీస్ ఒక మంచి స్కీమ్‌ను అమలు చేస్తోంది. అలాగే ఈ పథకం కుటుంబ ఆర్థిక భద్రతకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలనుకునేవారికి గ్రామ్ సురక్ష యోజన బాగా సహకరిస్తుంది.
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో భాగంగా ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది ఇండియా పోస్ట్. దేశంలోని గ్రామీణుల కోసం 1995లో గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని రూపొందించింది ఇండియా పోస్ట్.
గ్రామ్ సురక్ష యోజన స్కీమ్‌లో చేరిన వారికి 80 సంవత్సరాలు వయసు వచ్చాక.. అంటే మెచ్యూరిటీ సమయంలో బోనస్ వస్తుంది.
ఒకవేళ ఈ స్కీమ్‌లో చేరిన వారు ముందే మరణిస్తే, నామినీ లేదా కుటుంబ సభ్యులకు అందుకు సంబంధించిన డబ్బు అందిస్తుంది పోస్టాఫీస్. 19 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్న వారంతా ఈ పథకంలో చేరేందుకు అర్హులు.
ఇక ఈ స్కీమ్ కోసం కనీసం రూ.10 వేల ఇన్సూరెన్స్ మొత్తానికి పాలసీ తీసుకోవాలి. అలాగే గరిష్టంగా రూ.10 లక్షల ఇన్సూరెన్స్ మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియాన్ని... నెల వారీగా, మూడు నెలల వారీగా, ఆరు నెలల వారీగా, ఏడాదొకసారి చొప్పున చెల్లించే వెసులుబాటు కల్పించింది.
ఇక పాలసీ కొనుగోలు చేసిన నాలుగేళ్లకు లోన్ కూడా పొందొచ్చు. అలాగే నెలవారీ ప్రీమియం విషయానికి వస్తే, 55 ఏళ్లకు రూ.1515 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.
ఇక 58 ఏళ్లకుగాను రూ.1463, 60 ఏళ్లకు అయితే రూ.1411 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఈ స్కీమ్‌తో తక్కువ డబ్బుతో ఎక్కువ ఆదాయాన్ని కల్పిస్తుంది ఇండియా పోస్ట్.