శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (19:23 IST)

ఛత్రపతి శివాజీ మహారాజ్ 392వ జయంతి 2022 .. 16వ ఏటనే..!

Shivaji
మరాఠా రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ప్రతి సంవత్సరం శివాజీ జయంతిగా జరుపుకుంటారు. శివాజీ మహారాజ్ 392వ పుట్టినరోజును భారత్ 2022 ఫిబ్రవరి 19న జరుపుకోనుంది. శివాజీ మరాఠా యోధుడు మరియు మరాఠా రాజ్య స్థాపకుడు. 
 
1630లో పూణేలోని శివనేరిలో జన్మించాడు. ప్రధానంగా, భారతదేశంలోని ధైర్యవంతులైన, సాహసవీరులైన రాజుల్లో శివాజీ ఒకరు. శివాజీ జయంతిని మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. అతను ధైర్యం, పరిపాలన, పోరాట నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన వారు. 
 
మహారాజా ఛత్రపతి శివాజీ తెలివైన చక్రవర్తి, బ్రిటిష్ లేదా ఢిల్లీ సింహాసనానికి తలవంచలేదు. ప్రతి సంవత్సరం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వ సెలవుదినం జరుపుతుంది. 
 
రాష్ట్ర వాసులు ఆయన జయంతిని ఎంతో ఉత్సాహంగా, గర్వంగా జరుపుకుంటారు. శివాజీ తన పాలనలో, మరాఠీ, సంస్కృతం వంటి ప్రాంతీయ భాషలకు మద్దతు ఇచ్చారు. అందువలన, భారతీయ చరిత్రకు ఆయన చేసిన సేవలు రాబోయే తరాలకు అతన్ని రోల్ మోడల్‌గా చేశాయి. 


shivaji
 
ఇకపోతే.. శివాజీ జయంతి 2022కు ముందు ఫిబ్రవరి 18న అర్ధరాత్రి ఔరంగాబాద్‌లోని క్రాంతి చౌక్‌లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.  


shivaji
 
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు, మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి ఆదిత్య థాకరే, ఔరంగాబాద్ జిల్లా గార్డియన్ మంత్రి సుభాష్ దేశాయ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ విగ్రహాన్ని పూణేకు చెందిన శిల్పి దీపక్ తోపటే చెక్కారు.