ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హోలీ పండుగ
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 మార్చి 2022 (09:33 IST)

హోలీ పండుగ.. మార్చి 18.. హోలికా దహనం అంటే ఏమిటి?

హోలీ పండుగను మార్చి 18న జరుపుకోనున్నారు. అయినా మార్చి 17న హోలికా దహనాన్ని జరుపుకుంటారు. రాక్షస రాజు హిరణ్యకశిపుడు, అతని కుమారుడు ప్రహ్లాదుడి కథతో ఈ హోలికా దహన వేడుక ముడిపడి ఉంది.
 
రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు శత్రువు. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువు భక్తుడు. తన కుమారుడు విష్ణుమూర్తికి భక్తుడు కావడం హిరణ్యకశిపునికి నచ్చలేదు. దీంతో తన సోదరి హోలిక సహాయంతో తన స్వంత కొడుకు ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. కానీ హోలిక బారి నుంచి విష్ణువు ప్రహ్లాదుడిని రక్షిస్తాడు. 
 
విష్ణువు తనభక్తుడైన ప్రహ్లాదుడు ప్రాణాలను రక్షించి.. హోళికను అదే మంటల్లో కాలే విధంగా శిక్షించాడని పురాణాల కథనం. అప్పటి నుండి భగవంతుని భక్తుడైన ప్రహ్లాదుని జ్ఞాపకార్థం హోలికా దహనం జరుగుతుంది.
 
హోలికా దహనాన్ని ప్రజలకు ఎందుకు జరుపుకుంటారంటే..ఈ రోజున ప్రజలు హోలికను పూజిస్తారు. హోలిక అగ్నిలో అహం , చెడు దహించబడుతుందని నమ్ముతారు.  
 
హోలికా దహనం అనేది భోగి మంటతో కూడిన ఆచారం. ప్రజలు సాధారణంగా తమ కుటుంబం, స్నేహితులతో కలిసి భోగి మంటలను వేస్తారు. పూలు, అగరబత్తీలు, అక్షత, స్వీట్లు , పసుపు, కుంకుమ, కొబ్బరి, రంగుల నీటితో పూజించాల్సి ఉంటుంది. 
 
భోగి మంటకు ఐదు లేదా ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి ప్రార్థన చేయండి. ఈ రోజున హోలికను పూజించడం మనిషిలో అహం తగ్గి మంచి వైపు పయనిస్తారు.
 
శుభ సమయం: ఈ ఏడాది హోలికా దహనం మార్చి 17న జరగనుంది. శుభ సమయం రాత్రి 09:03 నుండి 10 గంటల వరకు ఉంది. మర్నాడు మార్చి 18న రంగుల పండగ హోలీని జరుపుకోనున్నారు.