బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం - భారీగా ఆస్తినష్టం

fire
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీ ఆస్తినష్టం వాటిల్లింది. ఆదివారం తెల్లవారుజామున కరోల్ భాగ్‌లో ప్రాంతంలోని గఫర్ షూ మార్కెట్‌లో ఈ భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాకదళ బృందం సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాద స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
ఈ ప్రమాదంపై ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ, కరోల్ భాగ్ గఫర్ షూ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదంపై ఉదయం 4.15 గంటల సమయంలో సమాచారం వచ్చింది. దీంతో 39 అగ్నిమాపకదళ శకటాలను అక్కడకు పంపించి మంటలను ఆర్పేవేసినట్టు తెలిపారు. 
 
మార్కెట్‌లోని మూడు లేన్లకు అగ్ని కీలల వ్యాపించినట్టు అధికారులు చెప్పారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఎవరైనా గాయపండిదీ లేనిదీ చెప్పగలమని ఓ అధికారి పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలిపారు.