గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (11:44 IST)

ప్రముఖ నటి రష్మీ ఆత్మహత్య

rashmi rekha
ఒరియా చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఆ చిత్రసీమకు చెందిన ప్రముఖ నటి రష్మీరేఖ ఆత్మహత్య చేసుకున్నారు. భువనేశ్వర్‌లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలో నాయపల్లి ప్రాంతంలో ఆమె నివసిస్తున్న అద్దె ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
రష్మీ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పంచనామాకు తరలించారు. 
 
కాగా, గత కొన్నేళ్లుగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తూ వస్తోందని, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి అతనే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీంతో రష్మీరేఖ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.