శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (21:26 IST)

సమంతతో విడాకులు.. శోభితా ధూళిపాలతో చైతూ లవ్..?

Naga Chaitanya, Sobhita Dhulipala
Naga Chaitanya, Sobhita Dhulipala
నాగచైతన్య, సమంత ఇద్దరు ప్రేమించి 2017లో వివాహం చేసుకోవడం తెలిసిందే. అయితే వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో 2021 అక్టోబర్ 2వ తేదీన విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఇద్దరు సింగిల్‌గానే ఉంటూ వస్తున్నారు. సమంత, చైతూ తమ కెరీర్‌పై దృష్టిపెట్టారు.
 
అయితే తాజాగా గూఢచారి, మేజర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన శోభితా ధూళిపాలతో నాగ చైతన్య ప్రేమలో పడ్డారనే సంగతి నెట్టింట వైరల్ అవుతోంది. కొద్ది వారాలుగా వారిద్దరూ డేటింగ్ చేస్తూ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నట్టు టాలీవుడ్ కోడై కూస్తోంది.   
 
సమంత రుత్ ప్రభుతో విడాకుల తర్వాత నాగార్జున హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లోని తన కొత్త ఇంటిలోకి మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా మరమ్మత్తులు జరుగుతున్న ఇంటిలో తమ కారును పార్క్ చేసుకొని ఇద్దరు కొంత సమయం గడిపారు. 
 
ఆ సమయంలో నాగచైతన్య, శోభితా ఇద్దరు ఆ ఇంటిలో కలిసి సన్నిహితంగా ఉన్నారు. దాంతో వారిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అంటూ ఆంగ్ల మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.
 
అంతేకాకుండా మేజర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శోభిత ఓ హోటల్‌లో ఉండగా.. ఆమెను నాగ చైతన్య కలిశారు. వాళ్లిద్దరూ చాలాసార్లు ఇటీవల కలిసి తిరగడం కనిపించింది. కానీ వారిద్దరి మధ్య లవ్ స్టోరి నడుస్తున్నాదా? రిలేషన్‌షిప్ ఉందా అనేది వారు అధికారికంగా స్పందిస్తే తప్పా.. ఇలాంటి వార్తలకు అడ్డుపడే అవకాశం లేదు అని మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి.