మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 11 ఆగస్టు 2025 (18:29 IST)

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

Geet Saini, Sricharan
Geet Saini, Sricharan
ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా రూరల్ లవ్ స్టొరీ "కన్యా కుమారి" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంలో గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో సహజ వాతావరణంలో నడిచే ఈ లైఫ్ ఫీల్‌ కథ సినిమాటిక్ టచ్‌తో ఒక కొత్త ఫీల్ ని అందించనుంది. 
 
ఈ చిత్రాన్ని ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో  శ్రీచరణ్ గీత్ సైనీని ప్రేమగా ఎత్తుకుంటూ, ఆమె చేతులకు సీతాకోకచిలుక రెక్కలు అలంకరించినట్టుగా డిజైన్ చేయడం ఆకట్టుకుంది.
 
"అన్ ఆర్గానిక్ ప్రేమ కథ" అన్న ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. రిలీజ్‌ దగ్గరపడటంతో టీమ్ మరింత జోరుగా ప్రమోషన్స్‌కి సిద్ధమవుతోంది.
 
రవి నిలమర్తి అందించిన ఆకట్టుకునే సంగీతం, శివ గాజుల, హరి చరణ్ కె అద్భుతమైన సినిమాటోగ్రఫీ, నరేష్ అడుపా ఎడిటింగ్ ఇవన్నీ ఈ ప్రేమకథను మరింత అందంగా మలిచాయి.