గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జూన్ 2022 (12:54 IST)

ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ రద్దు

anantha babu
మాజీ డ్రైవర్‌, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు తోసిపుచ్చింది. 
 
బెయిల్‌ మంజూరు చేయడానికి నిందితుడి తరపు న్యాయవాది సరైన కారణాలు చూపనందువల్ల బెయిల్‌ పిటిషన్‌‌ను రద్దు చేస్తున్నట్టు కోర్టు తెలిపింది. 
 
మరోవైపు ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు స్పందిస్తూ బాధితుల తరపున వేసిన కౌంటర్‌ పిటిషన్‌లోని అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేసిందని చెప్పారు. 
 
అనంతబాబు బెయిల్‌ పై విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే అంశాలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారని అన్నారు.