గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 5 ఆగస్టు 2022 (18:18 IST)

అవంతి అరగంట సరసం, అంబటి గంట విరహం, గోరంట్ల సెక్సువల్ హెరాస్: బుద్ధా పంచ్‌లు

buddha venkanna
వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని తెదేపా నాయకులు ట్విట్టర్ వేదికగా తూర్పారబడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు వైసిపి, సీఎం జగన్ మోహన్ రెడ్డిపైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా తెదేపా నాయకుడు బుద్ధా వెంకన్న ట్విట్టర్లో స్పందిస్తూ... వైఎస్సార్సీపి అంటే యువజన శృంగార రసిక చిలిపి పార్టీ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

 
అవంతి అరగంట సరసం, అంబటి గంట విరహం, గోరంట్ల సెక్సువల్ హెరాస్ అంటూ విమర్శించారు. ఇలాంటి రాసలీలలు పార్టీ బ్రాండింగుగా మారాయనీ, అలా గుర్తింపు తెచ్చుకుంటే మంత్రి పదవులు కూడా వస్తున్నాయనీ, మరి న్యూడ్ హెరాస్ చేసిన గోరంట్లకు ఎలాంటి పదవి ఇచ్చి గౌరవిస్తారో అంటూ సెటైర్లు విసిరారు.

 
అంబటి, అవంతిలపై ఆనాడే చర్యలు తీసుకుని వుంటే ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఇలా వ్యవహరించి వుండేవాడు కాదంటూ పేర్కొన్నారు. మహిళను హెరాస్ చేసిన గోరంట్లను తక్షణమే ఎంపీ పదవి నుంచి తొలగించి వైసిపి నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసారు.