బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (17:11 IST)

కర్ణాటకలో దారుణ ఘటన: బాల్కనీలో నిలబడి బిడ్డను విసిరేసింది...

child
కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. బెంగళూరులోని ఎస్ఆర్‌నగర్‌లో ఉన్న ఒక ఇంట్లో దారుణ ఘటన జరిగింది. ఒక మహిళ నాలుగో అంతస్థులో బాల్కనీలో నిలబడి తన కూతురుని కిందకు విసిరేసింది. దీంతో చిన్నారి తలపగలి అక్కడే చనిపోయింది. 
 
ఈ క్రమంలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. నాలుగేళ్ల బాలికకు మాటలు రావని, వినబడదని అందుకే తల్లి ఇలా చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
అంతేకాకుండా బాలిక తల్లి, సాఫ్ట్ వేర్ ఇంజినీర్, తల్లి డెంటల్ డాక్టర్. అయితే.. తల్లి మానసిక ప్రవర్తనపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహిళ కొన్నిరోజులుగా తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. 
 
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం తల్లి కింద విసిరేసిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.