గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (09:30 IST)

రెయిలింగ్‌ను ఢీకొట్టి గోడ అంచున నిలిచిన కారు... తప్పించుకున్న మహిళ

car accident
హైదరాబాద్ నగరంలో ఓ మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆమె నడుపుతూ వచ్చిన కారు ఒకటి బ్రేకులు విఫలం కావడంతో రెయిలింగ్ ఢీకొట్టి గోడ అంచున వచ్చి ఆగిపోయింది. దీంతో కారు ముందు భాగం కొద్దిగా ధ్వంసమైంది. గోడ కూడా విరిగిపోయింది. దీంతో 25 అడుగుల ఎత్తులో గాలిలో వేలాడుతూ కనిపించింది. 
 
కారు వేగంగా వచ్చి గోడను ఢీకొనడంతో గోడ శిథిలాలు కింది భాగంలో ఉన్న రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు బ్రేకులు పూర్తిగా విఫలం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని రాజ్‌భవన్‌ రోడ్డులో జరిగింది. ఈ ప్రమాదాన్ని గమనించిన కొందరు స్థానికులు తక్షణం స్పందించి కారులోని మహిళను ప్రాణాలతో కాపాడారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి కారును వెలికితీశారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.