బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (12:09 IST)

మహిళా సర్పంచ్‌పై 11 మంంది లైంగికదాడికి యత్నం

victim
ఏపీలోని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ఓ మహిళా సర్పంచ్‌పై 11 మంది లైంగికదాడికి ప్రయత్నించారు. దీనిపై బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
ఆ మహిళా సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదులో తాను రేకులషెడ్డులో ఉండగా బుధవారం మధ్యాహ్నం పి.రమణబాబు, పి.సుధాకర్‌, పి.మధు, పి.జగదీష్‌, పి.భద్రరావు, ఎల్‌.సురేష్‌కుమార్‌, ఎ.శ్రీనివాసరావు, ఎల్‌.వెంకటరాజు, పి.ప్రసాద్‌, ఇ.సోమశేఖర్‌, పి.శ్రీనివాసరావు వచ్చి లైంగికదాడికి యత్నించారని పేర్కొన్నారు. 
 
పైగా, వారిని ప్రతిఘటించే యత్నం చేయడంతో చంపాలని చూశారన్నారు. మెడభాగం, పొత్తి కడుపు, ఇతర అవయవాలపై దాడిచేసి చిత్రహింసలకు గురిచేశారని వెల్లడించారు. కేకలు వేయగా.. చుట్టుపక్కల వారు రావడంతో పారిపోయారని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.