1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఇంటి నిర్మాణానికి డబ్బులు అడిగిన ప్రేమికుడు.. ఇవ్వకపోవడంతో

arrest
ఇంటి నిర్మాణానికి తన ప్రియురాలి వద్ద ప్రేమికుడు డబ్బులు అడిగాడు. ఆమె తల్లిదండ్రులను అడిగి డబ్బుులు సమకూర్చలేక పోయింది. దీంతో ఆమె నగ్న చిత్రాలను కన్నతండ్రికి పంపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోకిరి ప్రేమికుడు ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని శృంగవరపు కోట మండలం, ముషిడిపల్లి గ్రామానికి చెందిన శీరెడ్డి నవీన్ అనే యువకుడు స్థానికంగా ఉండే సచివాలయంలో ఇంజనీరింగ్ సహాయకుడుగా పని చేస్తున్నాడు. ఇతనికి అదే సచివాలయంలో పని చేసే ఓ యువతిని గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరిద్దరిదీ ఒకే కులం కావడంతో వారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకరించారు. 
 
ఇక్కడవరకు అంతా సజావుగానే సాగింది. కానీ, ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. నవీన్ ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇందుకోసం కొంత డబ్బు కావాలని కోరాడు. అయితే, డబ్బులు ఇవ్వలేమని యువతి తండ్రి తెగేసి చెప్పాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు చెలరేగాయి. తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో బెదిరింపులకు దిగాడు. 
 
అమ్మాయి నగ్న చిత్రాలను ఆమె తండ్రికి పంపాడు. డబ్బులు ఇవ్వకుంటే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ జరుపుతున్నారు.