శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 3 మే 2022 (19:23 IST)

రహదారి సమీపంలో నగ్నంగా యువతి-యువకుడి శవాలు: మర్మాంగం ఛిద్రం చేసారు

murder
రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో జంట హత్యలు కలకలం రేపాయి. ఓ యువకుడు, ఓ యువతి శవాలు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి కొత్తగూడెం బ్రిడ్జికి సమీపంలో నగ్నంగా పడి వున్నాయి. వారి శవాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... హత్యకు కారణం వివాహేతర సంబంధం అని ప్రాధమిక నిర్థారణకు వచ్చారు. ఇద్దరి శవాల పక్కనే ఓ బ్యాగు వుండటంతో దాని ఆధారంగా మృతుల వివరాలను కనుగొన్నారు. వీరిద్దరూ చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని వారాసిగూడకు చెందిన 22 ఏళ్ల యశ్వంత్, 28 ఏళ్ల జ్యోతిగా గుర్తించారు. యువకుడి మర్మాంగం ఛిద్రం చేసినట్లు గాయాలను బట్టి తెలుస్తుంది. మృతురాలు జ్యోతి తలపై బండరాయితో మోది చంపేసారు.

 
కాగా ఆదివారం సాయంత్రం యశ్వంత్ ఇంటి నుంచి వెళ్లి, ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అతడి సోదరుడు తెలిపాడు. ఐతే జ్యోతి ఎవరో తమకు తెలియదన్నారు. మృతురాలు జ్యోతికి భర్త, ఇద్దరు పిల్లలున్నట్లు తేలింది. ఐతే ఈ హత్యలు చేసింది ఎవరన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది.